![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద కార్తీక దీపం సీరియల్ ఒక సెన్సేషన్. అందులో వంటలక్క రోల్ ఫుల్ ఫేమస్. ఆ రోల్ లో నటించిన ప్రేమి విశ్వనాధ్ కి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. కార్తీక దీపం సీజన్ 1 ఐపోయింది ఇప్పుడు సీజన్ 2 నడుస్తోంది. అలాంటి ఈ సీరియల్ ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలోకి రాబోతున్నారు. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "ఇప్పుడు మారింది లెక్క వచ్చింది వంటలక్క" అంటూ ప్రేమి విశ్వనాధ్ మంచి స్టైల్ గా చెప్పింది.
అద్దిరిపోయే కాస్ట్యూమ్ తో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో స్టేజి మీద వచ్చి కుర్చీలో కూర్చుని మరీ చెప్పింది. ఇక శ్రీముఖి ఐతే "మా పరివారంతో మేము జరుపుకుంటున్నాము కార్తీక దీపం స్పెషల్ " అని చెప్పింది. ఇక ఈ షోలో దీపమ్మ ముద్దుల కొడుకు వచ్చేసాడు అంటూ ఒక వీడియోని ప్లే చేశారు. అందులో ప్రేమీ కొడుకు మనో వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. " ఐ మిస్ యు " అని ప్రేమి చాలా బాధతో చెప్పింది. "నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మా " అని చెప్పాడు.
"అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం " అంటూ అచ్చ తెలుగులో చెప్పేసరికి వంటలక్క అలియాస్ ప్రేమి ఎమోషనల్ ఐపోయింది. ప్రేమి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొంతకాలం క్రితం కొచ్చి, తిరువనంతపురంలో వి మీడియా ది కంప్లీట్ స్టూడియో అనే రెండు ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేసి ఆమె మ్యానేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఒక పక్కన సీరియల్స్ అవకాశం వచ్చినప్పుడు మూవీస్ లో కూడా నటిస్తున్నారు వంటలక్క.
![]() |
![]() |